శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్ నియామకం

 శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శిగా  రాజేంద్రప్రసాద్ నియామకం


మొన్న ఆదివారం డా.బి.ర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ,అమలాపురంలో శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ గౌరవ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యంలో ,జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ రుద్రరాజు నానిరాజు గారి సహకారంతో,జిల్లా కమిటీ సత్యనారాయణగారు ,బాలార్జున గారు ,నర్సిం హ మూర్తి గారు నిర్వహించిన 132 వ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ,హైదరాబాద్ కి చెందిన శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తన బాధ్యతను ఎంతో క్రియాశీలకంగా నిర్వహిస్తున్న శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ ని ,శ్రీ శ్రీ సంస్థ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ గారు ,ఆయన్ని రాష్ట్ర కార్యవర్గం నుంచి జాతీయ కార్యవర్గంలోకి ప్రమోట్ చేస్తున్నామని ప్రకటిస్తూ ,రాజేంద్రప్రసాద్ గారు ఎంతో మంచి వ్యక్తి ,ఆత్మీయ సోదరుడు అని ,ఆయన ఏ కార్యక్రమం అయిన తలపెడితే ,ఆ కార్యక్రమం మంచి ప్రణాళికబద్దంగా ఉండి ,అందరినీ ఆకర్షింపచేస్తుంది అని ,ఇక ఆ ప్రోగ్రాం హీట్ ని మరింత పెంచుతుంది అని గరిమెళ్ళ గారి సేవలను కొనియాడుతూ ,భవిష్యత్తులో జాతీయ కార్యదర్శిగా ఎలా ఉండాలో ,ఎలా నడుచుకోవాలో, ఏమేమి చెయ్యాలో అని తగు సూచనలు అందించి ,నేటి నుంచి గరిమెళ్ళను శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నియమిస్తున్నామని తగు ఉత్తర్వులు కూడా జారీ చేసారు .అక్కడికి విచ్చేసిన జాతీయ ,రాష్ట్ర కార్యవర్గం మరియు కవులు ,కళాకారుల ముందు ఘనంగా సన్మానాన్ని అందించారు .

ఈ సంధర్భంగా రాజేంద్రప్రసాదు గారు మాట్లాడుతూ ,ఆయన జాతీయ కార్యదర్శిగా నియమింపబడినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ,శ్రీ శ్రీ కళావేదిక అనేది ఒక సంస్థ కాదని ,ఎంతో మంది కవులకు ,కళాకారులకు,అన్ని రాష్ట్రాల ,జిల్లాల కార్యవర్గ సభ్యులకు ఇది ఒక పాఠశాల అని ,ఇక్కడికి వచ్చిన ,ఇందులో ఉన్న ప్రతీ ఒక్కరికి ఎంతో కొంత నేర్చుకుని ,తమని తాము ,సాహిత్య ,సాంస్కృతిక ,సామాజిక ప్రకారంగా ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుందని ,ఇష్టంగా కష్టపడి పని చేసే ప్రతీ ఒక్కరికి మంచి నాలెడ్జ్ తో పాటు ,గుర్తింపు ఉంటుందని ఈ విధంగా మరి ఏ సంస్థ కూడా తమ యొక్క ఉనికినే చూసుకుంటాయి కాని కవులని ,కళాకారుల యొక్క ప్రతిభని పట్టించుకోవని కాని ఇక్కడ ''ప్రతిభ మీది అయితే పట్టాభిషేకం మాది ''అనే నినాదంతో శ్రీ శ్రీ కళావేదిక సంస్థ మన కోసం ఎటువంటి లాభపేక్షణ లేకుండా పనిచేస్తుందని అటువంటి సంస్థలో తాను ఒక భాగస్వామి కావటం ,తనకెంతో గర్వంగా కూడా ఉందని ఆయన చెప్పారు.అలాగే సంస్థ చైర్మన్ ప్రతాప్ గారు కేవలం ఒక వ్యక్తి కాదని మహా శక్తి అని ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు ,అటువంటి వారితో పరిచయం ఉంటే చాలు అనుకునే స్థాయి నుంచి నేడు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావటం అదృష్టం అని చెప్పుకొచ్చారు.సంస్థ అంతర్జాతీయ సమన్వయకర్త అయిన శ్రీమతి కొల్లి రమావతి గారికి ప్రత్యేక కృత్జజ్ఞతలు చెప్పుకొచ్చారు .తాను చేసే ప్రతీ పనిలో రమావతి గారు & ఇతర జాతీయ కార్యవర్గ సభ్యులు లలిత చిట్టే గారు ,కట్ల బాగ్యలక్ష్మి గారు ,ఈశ్వరి భూషణం గారు ,డేబా విజయ్ కుమారు గారు ,సతీష్ ఎర్రా గారు ,కరుణాకర్ రావు గారు వీరికి సంపూర్ణ సహకారం అందించి వీరికి చాలా సార్లు తోడ్పాటు నిచ్చారని చెప్తూ వీరందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ ..ఇదే సహకారాన్ని ముందుముందు అంచించవలసిందిగా చెప్పుకొచ్చారు

ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకునే దిశగా నిజాయితీ ,నిబద్దతతో ,అంకితభావంతో ,శ్రీ శ్రీ కళావేదిక సంస్థ కోసం ,తనకు సాధ్యమైనంత మేరకు కృషిచేస్తానని ,ఈ భాధ్యతను మరింత కర్తవ్యదీక్షతో నిర్వహిస్తానని ప్రకటించారు .శ్రీ శ్రీ సంస్థ చైర్మన్ ప్రతాప్ గారికి మరొకమారు హ్రృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని చెప్పారు


Comments